పోలింగ్ స్పెషల్: రాత్రి 11.30 వరకు మెట్రో ట్రైన్స్

హైదరాబాద్: పోలింగ్ సిబ్బందితో పాటు నగర ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఇవాళ(శుక్రవారం) మెట్రో రైళ్ల సమయాన్ని ఒక గంట పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో చివరి ట్రైన్ 10.30 గంటలకు బయలుదేరుతుండగా ఈరోజు మాత్రం నాగోల్,మియాపూర్,ఎల్బీ నగర్ మెట్రోస్టేషన్ ల నుంచి చివరి ట్రైన్ రాత్రి 11.30 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇక అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ నుంచి చివరి ట్రైన్ రాత్రి 12.15 గంటలకు బయలు దేరుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates