పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదింది

రక్షించాల్సిన పోలీసులే మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేయాలనుకున్నాడు ఓ పోలీసు ఆఫీసర్. అయితే మహిళ ప్రతిఘటించడంతో, చెప్పుదెబ్బల పాలయ్యాడు. ఈ సంఘటన  సోమవారం (జూలై-16) పంజాబ్‌ లోని ఫరీద్‌ కోట్‌ లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ పోలీసు అధికారి ఒంటరిగా ఉన్న మహిళను  అత్యాచారం చేసేందుకు యత్నించాడు.

దీంతో ఆ మహిళ  పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదినట్లు తెలిపింది. అయితే పోలీసును చెట్టుకు కట్టేసిన విషయాన్ని.. పోలీసు ఉన్నతాధికారులకు గ్రామస్తులు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ పోలీసును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మృగాలను వదలకూడదని, ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అతడికి సహకరించవద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాపాడాల్సిన పోలీసులో ిఇలా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని పోలీసులకు చెప్పుకున్నారు గ్రామస్థులు.

Posted in Uncategorized

Latest Updates