వివరంగా చెబుతా : విచారణకు హాజరైన వర్మ

ram

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. వెబ్ సినిమా.. జీఎస్టీపై చర్చ సందర్భంగా తనను దూషించారంటూ మహిళా సంఘం నాయకురాలు దేవి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు వర్మ. సీసీఎస్ స్టేషన్ లోకి వెళ్లిన వర్మను.. అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు తీసుకుంటున్నారు.

పోలీస్ విచారణపై.. ట్విటర్ లో స్పందించారు రామ్ గోపాల్ వర్మ. బాధ్యత కలిగిన పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. వాటిపై అధికారులకు వివరాలు అందజేస్తానన్నారు. మరోవైపు.. జీఎస్టీ సినిమాను సమర్థించుకున్న వర్మ తీరుపై.. విమర్శలు వచ్చాయి. పాశ్చాత్య నగ్న సంస్కృతిని మన దేశంపై ఎలా రుద్దుతారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పుడు తనను తాను సమర్శించుకున్న వర్మ.. ఇప్పుడు పోలీసుల ఎదుట హాజరయ్యి వివరణ ఇస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates