పోలీసులు,దోపిడీ దొంగల మధ్య కాల్పులు… 12 మంది మృతి

ఈశాన్య బ్రెజిల్ లో పోలీసులకు,దోపిడీ దొంగలకు మధ్య జరిగిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా 12 మంది మృతి చెందారు. నిన్న(శుక్రవారం) మిలాగ్రెస్ సిటీలోకి తెల్లవారుజామున భారీ పేలుడు సామగ్రి, మారణాయుధాలతో ఎంటర్ అయిన దుండగులు రెండు బ్యాంకులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు.

పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోగా.. పారిపోయే క్రమంలో ఎదురుగా కారులో వస్తున్న ప్రయాణికులను ఆపి వారిని బందీలుగా పట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా.. వెంటనే దోపిడీ దొంగలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. హోరాహోరీగా జరిగిన ఈ కాల్పుల్లో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరిని దుండగులు కాల్పి చంపారా.. లేక పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయారా.. అనే విషయంలో క్లారిటీ లేదని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. దోపిడీ కోసం దుండగులు ఉపయోగించిన మూడు వాహనాలతో పాటు గన్స్, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates