పోలీసులు ఏం చేస్తున్నారు : గంజాయి మాఫియా గుట్టు విప్పిన NRI

gangaihక్షణాల్లో పోలీసులు వాలిపోతారు.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం.. అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి అంటూ పదే పదే చెప్పే సీఎం చంద్రబాబునాయుడు పాలనలో.. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఇప్పుడు ఓ ఘోరాన్ని కళ్లకు కట్టినట్లు మరీ చెప్పాడు ఓ NRI. అమెరికా నుంచే వీడియోలో వివరాలు వెల్లడిస్తూ బెజవాడ సీపీ నవాంగ్ కు మెయిల్ ద్వారా కూడా కంప్లయింట్ పంపించారు. 25 ఏళ్లుగా బెజవాడ LIC కాలనీలోనే నివాసం ఉంటున్న నాగేశ్వరరావు నూతక్కి.. ఆ కాలనీలోనే కాకుండా విజయవాడలో జరుగుతున్న గంజాయి మాఫియా, వారి ఆగడాలు, కిరాతకాలను ఐదు నిమిషాల వీడియోలో వివరించారు.

ఇటీవల అమెరికా నుంచి విజయవాడ వచ్చాడు నాగేశ్వరరావు. కాలనీలో గంజాయి విక్రయాలు, పేకాట, చిన్న పిల్లలకు గంజాయిని అలవాటు చేసే ముఠా ఉందని గుర్తించాడు. స్కూల్ కు వెళ్లే పిల్లలు, బాలికలపై గంజాయి మాఫియా బ్లేడ్లతో దాడి చేస్తున్నారని.. స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడే స్థాయిలో వీరి అఘాయిత్యాలు ఉన్నాయని గుర్తించాడు. సాక్ష్యాలు సేకరించాడు నాగేశ్వరరావు. స్థానిక పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాడు. వారు అస్సలు పట్టించుకోలేదు. దీంతో కమిషనర్ నవాంగ్ దృష్టికి తీసుకెళ్లాలని అపాయింట్ మెంట్ కోరారు. దొరకలేదు. ఈలోపు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లినా.. దేశంపై ప్రేమ, సొంత గడ్డపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని నిర్ణయించుకున్నాడు నాగేశ్వరరావు నూతక్కి. తాను సేకరించిన ఆధారాలను సీపీకి మెయిల్ ద్వారా పంపించాడు. మీడియాకు కూడా కాపీ చేశారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఈ దారుణాలపై ఆయన మాటల్లోనే విందాం…

Posted in Uncategorized

Latest Updates