పోలీసులు మనుషులే…వారికి మానవత్వం ఉంది

హైదరాబాద్ : పోలీసులంటేనే కఠినాత్ములనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. కానీ వారు కూడా మనుషులే…వారికి మానవత్వం ఉందని నిరూపించుకొన్నారు హైదరాబాద్ పోలీసులు. రద్దీగా ఉన్న ప్రాంతంలో వాహనాన్ని నడుపుతున్న ఓ వ్యక్తికి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. ఆ స్థితిలో ఆయనను గమనించిన డ్యూటీలో ఉన్న పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన వామన్‌రావు(50) ఆటోమోటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. నిన్న(గురువారం) కారు నడుపుకొంటూ సికింద్రాబాద్‌ నుంచి శివరాంపల్లి వెళ్తున్నాడు. బహదూర్‌పుర ఠాణా పరిధి శంశాన్‌ఘాట్‌ ప్రాంతానికి రాగానే వామన్‌రావు ఎడమ చేయి, ఎడమ కాలు పక్షవాతానికి గురయ్యాయి. ఆ పరిస్థితిలోనూ వామన్‌రావు అతికష్టంపై వాహనాన్ని పక్కకు తీసి ఆపారు. అది గమనించిన పోలీసు కానిస్టేబుళ్లు సంజయ్‌, లవన్‌ వాహనం వద్దకు చేరుకున్నారు. కారు డోర్‌ను తెరిచి వామన్‌రావును బయటకు తీసి 108లో నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అభినందించారు బహదూర్‌పుర ఎస్సై ముజఫర్‌.

Posted in Uncategorized

Latest Updates