పోలీసుల ముందు లొంగిపోయిన నిర్మాత

weinsteinహీరోయిన్లపై లైంగిక వేధిపులకు పాల్పడిన ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ న్యూయార్క్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 66 ఏళ్ల ఈ హాలీవుడ్ నిర్మాత తమను రేప్ చేశాడంటూ.. లైంగికంగా వేధించాడంటూ కొంత మంది హీరోయిన్లు ఫిర్యాదు చేశారు. అయితే హీరోయిన్లతో పరస్పర అంగీకారం లేకుండా తానెప్పుడూ సెక్స్‌లో పాల్గొనలేదని అతను చెబుతూ వచ్చాడు.

హీరోయిన్ల ఆరోపణలు ఎక్కువ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మీటూ ప్రచారానికి తెర తీసింది. నటి లూసియా ఇవాన్స్ చేసిన ఆరోపణలపై పోలీసులు వైన్‌స్టీన్‌పై కేసు నమోదు చేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో న్యూయార్కర్‌లో వైన్‌స్టీన్ వేధింపుల గురించి ఓ ఆర్టికల్ రాసింది. మాన్‌హాటన్ క్రిమినల్ కోర్టులో వైన్‌స్టీన్‌ను హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates