పోలీసుల విన్నపం : ఎవర్ని పడితే వాళ్లను కొట్టొద్దు

DONGAదొంగల సంచారం, పిల్లల అపహరణపై వదంతులు, పుకార్లు నమ్మోద్దని పోలీసులు ఎంత చెప్తున్నా …జనాలను మాత్రం భయం వెంటాడుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ ….తట్టికోటలో బుధవారం (మే-23) రాత్రి ఓ మూగ వ్యక్తిని చావబాదారు స్థానికులు. భయంతో వణికిపోతున్న అతన్ని పోలీసులు విడిపించారు. బాధితుడిని గాంధారి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన బాలచందర్ గౌడ్ సైగలను అనుమానించి ..అతన్ని ప్రశ్నించారు స్థానికులు. సమాధానం చెప్పలేని బాలచందర్ ను… చెట్టుకు కట్టేసి కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

అతడి దగ్గరున్న ఆధార్ కార్డును పరిశీలించిన బంధువులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి వేడుకలో ఉన్న బంధువులు స్టేషన్ కు వచ్చి బాలచందర్ గౌడ్ ను తీసుకెళ్లారు. అలాగే జిల్లాలోని రెంజిల్‌ లో దొంగ అనుకొని గ్రామస్థులు ఓ కానిస్టేబుల్‌ ను పట్టుకున్నారు. తాను దొంగను కాదని.. కానిస్టేబుల్ అని చెప్పడంతో అతడిని గ్రామస్థులు వదిలేశారు. భీమ్‌గల్ మండలం చేంగల్ వద్ద ఇద్దరు గిరిజనులను దొంగలుగా భావించి గ్రామస్థులు దాడిచేసిన విషయం తెలిసిందే. బాధితుల్లో ఒకరు మృతిచెందారు.

Posted in Uncategorized

Latest Updates