పోలీసుల వేధింపులు..వ్యక్తి ఆత్మహత్యాయత్నం

poస్లీపింగ్ టాబ్లెట్లు మింగి ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. స్థానికులు సహకారంతో పోలీసులు సకాలం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది. KPHB కాలనీకి చెందిన పిడికిటి గోపాల్ చౌదరి అనే వ్యక్తి.. పోలీసులు వేధింపులు తాళలేకనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపాడు. MLA కృష్ణారావును అభివృద్ధి, అవినీతి పై నిలదీసినందుకే పోలీసులతో కలిసి అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. అయితే గోపాల్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు KPHB సీఐ. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పడానికి వెళ్లిన కానిస్టేబుళ్లపై ఆయన దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఆ తర్వాత నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యయత్నాకి పాల్పడినట్లు తెలిపారు. కానిస్టేబుళ్లపై దాడి చేసినందుకు  కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు KPHB సీఐ.

Posted in Uncategorized

Latest Updates