పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల ఏజ్ సడలింపు

POLICEపోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితం పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఏజ్ లిమిట్ పెంచాలంటూ నిరసనలు చేపట్టిన అభ్యర్థులు…మంత్రులకు, డీజీపీకి వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం..ఏజ్ సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే గతంలో మాదిరిగా ఆరేళ్లు కాకుండా మూడేళ్ల సడలింపుపై పోలీసు శాఖలో అంతర్గతంగా చర్చ జరిగినట్లు సమాచారం.

మూడేళ్లు అవకాశం కల్పిస్తే 30 వేల మందికి అవకాశం ఉంటుందని..దీనికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రతి పాదనలు పంపింది. 18 వేలకు పైగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి సారి నియామకాల్లో ఆరేళ్ల పాటు ఏజ్ సడలింపు సడలింపు కల్పించగా 75 వేల మందికి పైగా అవకాశం లభించింది.

బోర్డు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌తో రెండు, మూడు రోజుల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటె లిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ తదితర అధికారులు చర్చించే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోడానికి అధికారులు ప్రయత్ని స్తున్నట్లు సమాచారం. భేటీ జరిగితే 2, 3 రోజుల్లో సడలింపుపై ఉత్తర్వులు వెలువ డతాయని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులొస్తే సడలింపునకు సంబంధించి సవరణ చేస్తూ నోటిఫికేషన్‌ ఇస్తామని వారు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates