పోలీసే టార్గెట్: వాహనంతో బీభత్సం

Gujarath-Vehicle-CC-footageగుజరాత్ లోని గిర్ సోమనాథ్ లో రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలో వాహనం బీభత్సం సృష్టించింది. గల్లీలోకి కారుతో వేగంగా వచ్చిన డ్రైవర్.. సడెన్ గా ఆపి.. వెనక ఉన్న బైక్ ను ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. తర్వాత అక్కడే వెహికల్ ను తిప్పి.. మరోమారు ఢీకొట్టాలని చూశాడు. ఏం జరుగుతుందో తెలియక జనాలు భయపడిపోయారు. అక్కడినుంచి వాహనంలోనే డ్రైవర్ పారిపోయాడు. సీసీ టీవీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డయ్యాయి. ఓ కానిస్టేబుల్ పై హత్యా ప్రయత్నం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీ టీవీ పుటేజ్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు…నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates