పోలీస్‌ స్టేషన్‌లో అత్త, మామపై కత్తితో దాడి

హైదరాబాద్ బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో దారుణం జరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడిన రెహమాన్‌ అనే వ్యక్తి ఐదుగురిపై కత్తితో విచక్షణంగా దాడి చేశాడు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రెహమాన్‌పై ఫిర్యాదు చేసేందుకు భార్య, అత్త, మామ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విషయం తెలుసుకున్న రెహమాన్ కొబ్బరిబొండాల కత్తితో పోలీస్ స్టేషన్‌లో చొరబడి విచక్షణారహితంగా వారిపై దాడి చేసి పరారయ్యాడు. పోలీస్‌స్టేషన్‌ అంతా రక్తమయం అయింది. దీంతో మహిళా పోలీసులు భయాందోళనకు గురయ్యారు. పరారీలో ఉన్న రెహమాన్ అదుపులోకి తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates