పోలీస్ ఉద్యోగాలకు ఆగస్టులో రాతపరీక్ష

telangana police పోలీస్‌ శాఖలోని ఎస్సై, కానిస్టేబుళ్లతోపాటు ఆయా విభాగాల్లో 18,428 ఖాళీల భర్తీకి ఆగస్టులో ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నియామక బోర్డు అధికారులు. గత శనివారం నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 30తో ముగుస్తుంది. మొదటి రోజు సుమారు మూడు వేల దరఖాస్తులు వచ్చాయి. రెండోరోజు దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గినా మూడోరోజు సోమవారం తిరిగి పుంజుకుంది. మొత్తం ఎంపిక ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా నియామకబోర్డు అధికారిక వెబ్‌సైట్‌, వెబ్‌సైట్‌లో సూచించిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలే తప్ప ఇతరుల్ని ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు. మరోవైపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తు సరిచేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే దరఖాస్తు ప్రక్రియ ముగిశాక తప్పిదాలు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates