పోలీస్ కస్టడీకి ఎంసెట్ నిందితులు

ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది నాంపల్లి న్యాయస్థానం. ఈ కుంభకోణంలో ఇటీవల అరెస్టయిన వాసుబాబు, వెంకట శివనారాయణరావులను విచారించడానికి సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. రెండేళ్లుగా జరుగుతున్న దర్యాప్తులో కార్పొరేట్‌ కళాశాలల పేర్లు బయటపడటం ఇదే ప్రథమం. ఈ కుంభకోణంలో వీరి పాత్ర గురించి మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఇద్దర్నీ తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయస్థానం ఈనెల 13 నుంచి 19 వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైలు నుంచి సీఐడీ పోలీసులు పోలీస్ కస్టడీకి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates