పోలీస్ కాదు.. ఆవు చనిపోతే న్యూస్ అవుతోంది : నసీరుద్దీన్ షా

దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆవేదనగా ఉందన్నారు బాలీవుడ్ విఖ్యాత నటుడు నసీరుద్దీన్ షా. కార్వాన్ ఎ మొహబ్బత్ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై సూటిగా స్పందించారు. బులంద్ షహర్ లో జరిగిన మూకదాడిని ప్రస్తావించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అంతటా బాగా పెరిగిపోయిందని అంటున్నారు. ఈ రోజుల్లో ఓ పోలీస్ అధికారి చనిపోయినా జనం స్పందించడం లేదని.. ఒక ఆవు చనిపోతే మాత్రం అదే పెద్ద న్యూస్ అవుతోందని అన్నారు. సాటి మనిషికి విలువ తగ్గిపోతోందని ఆవేదనగా చెప్పారు. మతం ప్రాతిపదికగా జనాల మధ్య భేదాభిప్రాయాలు పెరిగిపోతున్నాయని చెప్పిన నసీరుద్దీన్… రేపు మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన పెరుగుతోందని చెప్పారు నసీరుద్దీన్ షా.

‘నా భార్య రత్న ఓ హిందూ. నా పిల్లలకు మతం లేదు. రేపు మా పిల్లలను మీరు ముస్లిమా.. హిందువా’ అని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లు ఏ సమాధానమూ చెప్పలేరని అన్నారు నసీరుద్దీన్ షా. తమ కుటుంబాల మధ్య మతం అనే అడ్డుగోడలు లేవని… రేపు కూడా ఆ విషయంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదనేదే తమ ఉద్దేశమన్నారు.

Posted in Uncategorized

Latest Updates