పోలీస్ క్రికెట్ లీగ్: నార్త్ జోన్ టీమ్ పై సెలబ్రిటీ టీమ్ విక్టరీ

CRI1హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పెషల్ క్రికెట్ మ్యాచ్ తో ఆకట్టుకున్నారు సిటీ పోలీసులు. హైదరాబాద్ పోలీస్ క్రికెట్ లీగ్ పేరుతో నిర్వహించిన టోర్నీలో ఫైనల్ లో నార్త్ జోన్ టీం … సెలెబ్రిటీ టీంతో పోటీ పడింది. ఈ మ్యాచ్ లో నార్త్ జోన్ టీమ్ పై… సెలబ్రిటీ టీమ్ 14 రన్స్ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సెలబ్రిటీస్ టీం 10 ఓవర్లకు … 84 రన్స్ కొట్టింది. 85 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నార్త్ జోన్ టీం 80 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 14 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది సెలబ్రిటీ టీం.

క్రికెట్ మ్యాచ్ కు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సినీ నటులు నాగార్జున, వెంకటేష్, సుమన్, నాని, అఖిల్, నాగచైతన్య ఈ మ్యాచ్ లకు హాజరయ్యారు. నాగార్జున సెలబ్రిటీ టీం తరపున మ్యాచ్ ను ప్రారంభించాడు.

సిటీ పోలీసులు అందరితో స్నేహంగా మెలగడం సంతోషంగా ఉందన్నారు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి. ప్రజలు, పోలీసులు కలిసి పని చేయడంతో రాష్ట్రం శాంతిభద్రతలలో ముందుందన్నారు నాయిని. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. ప్రజలకు మరింత భద్రత కల్పిస్తామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.  ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు… హైదరాబాద్ పోలీస్ క్రికెట్ లీగ్ పేరుతో ఐదు జోన్ ల పరిధిలో క్రికెట్ లీగ్ నిర్వహించినట్లు చెప్పారు పోలీసులు. ఈ లీగ్ లో 270 జట్లు పాల్గొన్నాయని, 40వేల మందికి పైగా యువత క్రికెట్ ఆడినట్లు చెప్పారు. గత రెండు నెలలుగా లీగ్ నిర్వహించి.. సక్సెస్ చేశామన్నారు.

రెండు నెలల పాటు డివిజన్ల వారీగా టోర్నీ నిర్వహించి.. క్రికెట్ టోర్నీని సక్సెస్ చేయడం ఆనందంగా ఉందన్నారు హీరో వెంకటేష్. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేందుకు ఇలాంటి టోర్నీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్  అందర్నీ అలరించాయి. రాష్ట్ర సాంప్రదాయం  ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పేరణి, డోలు నృత్యం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

సింగర్స్ పాటలు పాడుతూ.. ప్రేక్షకులను మరింత ఉత్సాహ పరిచారు. గీతామాధురి, శ్రీకృష్ణ పాడిన పాటలకు ఆడియన్స్ డ్యాన్సులు చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates