పోలీస్ వ్యాన్ బోల్తా..SIకి తీవ్ర గాయాలు

మంచిర్యాల జిల్లాలోని జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ జీప్ బోల్తా పడింది. శనివారం (జూలై-14) సాయంత్రం జరిగిన ఈ ఘటనలో జన్నారం ఎస్సైకి తీవ్రగాయాలయ్యాయి. లక్షెటిపేట పట్టణంలో లోక్ అదాలత్‌ కు వెళ్లి వస్తుండగా జన్నారం జింకల పార్క్ సమీపంలో జీప్ ముందు టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన జీప్ చెట్టుకు ఢీకొన్నది. తీవ్రంగా గాయపడిన జన్నారం ఎస్సై తహిసినొద్దీన్‌ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates