పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యకు యత్నించిన మహిళ

ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. వినాయక విగ్రహాల తయారీ, పెట్టుబడి విషయంలో విగ్రహాల తయారీ దారులకు, పెట్టుబడిదారులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ విషయమై బాధిత మహిళ బట్టు సునీత సోమవారం నాడు పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ స్టేషన్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

Posted in Uncategorized

Latest Updates