సాయం చేస్తానని వేరే పార్టీకి ఓటేశాడు.. పోల్ ఆఫీసర్ ను కొట్టిన ఓటర్లు

వృద్ధులకు.. దివ్యాంగులకు ఓటు వేయడంలో సహాయం చేయడం పోల్ ఆఫీసర్లు, సిబ్బంది బాధ్యత. ఈ బాధ్యతను పక్కనపెట్టి… విధుల్లో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలింగ్ సిబ్బందిపై స్థానికులు దాడిచేశారు.

ఓటరు ఒక పార్టీకి ఓటు వేయమంటే పోల్ అధికారి మరో పార్టీకి ఓటువేసిన ఘటన సూర్యాపేట్ జిల్లా హుజుర్ నగర్ లో జరిగింది. దీంతో ఆ ఆఫీసర్ పై ఓటర్లు దాడి చేశారు.  మేళ్ల‌చెరువు మండ‌లంలోని వెల్ల‌టూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన దివ్యాంగ వృద్ధురాలికి పోల్ ఆఫీస‌ర్‌ సహాయ‌ప‌డేందుకు వెళ్లి.. ఓటరు ఓ పార్టీకి ఓటువేయమంటే తాను మరో పార్టీకి ఓటువేసినట్టు సమాచారం. దీంతో ఓటరు అభ్యంత‌రం తెలుపగా అక్కడే ఉన్న మిగితా ఓటర్లు సదరు ఆఫీసర్ పై దాడి చేశారు. విధుల్లో ఉన్న మిగ‌తా పోల్ సిబ్బంది.. ఆ పోల్ ఆఫీస‌ర్‌ను అక్క‌డ నుంచి పంపించేశారు. ఈ ఘ‌ట‌న‌పై రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ వివ‌ర‌ణ కోరారు.

Posted in Uncategorized

Latest Updates