పోస్టుమార్టం కోసం కూతురి మృతదేహాంతో తండ్రి 8 కి.మీ

చనిపోయిన తన కూతురుని వెహికిల్ లో ఇంటికి కూడా తీస్కెళ్లలేని స్థితి ఆ తండ్రిది. అంతేకాదు దహన సంస్కారాలు చేయడానికి కూడా చేతిలో చిల్లి గవ్వలేదు. దీంతో..పోస్టుమార్టం కోసం తన బిడ్డ మృతదేహాంతో 8 కిలోమీటర్లు నడిచాడు ఆ నిరుపేద తండ్రి. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. గజపతి జిల్లాలోని అతంక్‌పూర్ గ్రామానికి ముకుంద్ దొర కూతురు బాబిత (7)అక్టోబర్ 11న తిత్లీ తుపాను వరదల్లో చిక్కుకుపోయింది. మొత్తానికి ఈ నెల 17న బాబిత మృతదేహం దొరికింది. కొండచరియలు విరిగిపడటంతో చిన్నారి బాబిత మృతి చెందినట్లు అధికారులు స్పష్టం చేశారు. శవ పరీక్ష నిర్వహిస్తేనే ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది…దీంతో కూతురి అంత్యక్రియలు నిర్వహించవచ్చని ముకుంద్ ఆశ. దీంతో చిల్లి గవ్వా కూడా లేని ఆ నిరుపేద తన బిడ్డ మృతదేహాన్ని భుజాలపై వేసుకొని 8 కిలోమీటర్ల నడిచాడు.

 

Posted in Uncategorized

Latest Updates