ప్యాకెట్లు వచ్చేశాయ్ : పాలు తోడుకి పెరుగు అవసరం లేదు

milk-curdపిన్నిగారు కొంచెం పెరుగు ఉంటే ఇస్తారా.. అక్కా పిల్లోడుని పంపిస్తా తోడుకి పెరుగు ఇవ్వు పాలు తోడేసేందుకు అవసరం కొద్దీ చుట్టుపక్కల వారినీ ఇలాగే అడుగుతారు మన మహిళలు. నాలుగు రోజులు బయటకు వెళ్లి వస్తే ఓ ప్యాకెట్ పాలు, మరో ప్యాకెట్ పెరుగు కొనుక్కుని వస్తాం. కొంచెం పెరుగును ఉంచి.. పాల తోడుకు ఉపయోగిస్తాం. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్. ఇక నుంచి పాల తోడుకి పెరుగు అవసరం లేదంటున్నారు తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తలు. పెరుగుకు ప్రత్యామ్నాయంగా సరికొత్త పౌడర్ తయారు చేశారు. ప్రయోగ దశలోనూ విజయవంతం అయ్యింది. దీనికి చేరిమి సాచెట్ అనే పేరు కూడా ఖరారు చేశారు. అతి త్వరలోనే ఈ చేరిమి సాచెట్స్ కు మార్కెట్ లోకి రాబోతున్నాయి.

చేరిమి ప్యాకెట్ లో ఏముంటుంది?

చేరిమి ప్యాకెట్ తీసుకొచ్చి పాలలో వేస్తే చాలు.. పెరుగు అయిపోతుంది. అది కూడా జస్ట్ మూడు గంటల్లోనే. మామూలుగా అయితే ఆరు గంటలు పడుతుంది. పెరుగు కావటానికి ఈ రెడీమేడ్ ప్యాకెట్ కలపటం వల్ల మూడు గంటల్లోనే పెరుగు తయారీ. పాలు పెరుగుగా మారటానికి ల్యాక్టో కోకస్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియాను పాల నుంచి సేకరించారు. దాన్ని మూడు దశల్లో వేరు చేశారు. దాని నుంచి రెడీమేడ్ తోడును సృష్టించారు. ఇది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. ప్రస్తుతం పాలు, పెరుగు ఎక్కడెక్కడ అమ్ముతున్నారో.. ఈ తోడు ప్యాకెట్లు కూడా అక్కడ అందుబాటులో ఉండనున్నాయి. పాలు, పెరుగుకు ఉన్నట్లే.. ఈ చేరిమి ప్యాకెట్ ఉపయోగానికి టైం ఉంటుంది. ధర కూడా చాలా తక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తలు.

Posted in Uncategorized

Latest Updates