ప్యాసింజర్ల కోసం… ఎయిర్ పోర్టు రన్ వే పై స్టెప్పులు

క్రికెట్ లో అంపైర్ బిల్లీ బౌడెన్ గుర్తుండే ఉంటాడు. బ్యాట్స్ మన్ బౌండరీ కొట్టినప్పుడు, ఔట్ అయినప్పుడు.. ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్, సిగ్నల్స్ ఇచ్చే విధానం గమ్మత్తుగా ఉండేది. ప్రొఫెషన్ ను ఎంటర్ టైన్ మెంట్ తో మిక్స్ చేసినప్పుడే ఇలాంటి సన్నివేశాలు చూడగలం. అమెరికాలోనూ ఓ ఎయిర్ పోర్టు ఉద్యోగి ఇలాగే చేస్తున్నాడు. అతడు రన్ వేపై చేసిన డాన్స్ వీడియో సోషల్  మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అతడి పేరు జామౌల్ అలెన్. ఎయిర్ పోర్టు బోర్డింగ్ పాయింట్ దగ్గర అతడు ర్యాంప్ వర్కర్ గా డ్యూటీ చేస్తుంటాడు. వయసు 28 ఏళ్లు. ఈ మధ్యే ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ టేకాఫ్ తీసుకునేటప్పుడు.. దాని పక్కనే ఉండి… స్టెప్పులేశాడు. ఇది చూసిన ప్యాసింజర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతర్జాతీయ మీడియా ఛానెళ్లు అతడిని కనిపెట్టి అతడితో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి.

చేత్తో రెడ్ సిగ్నల్స్.. గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూనే.. స్టెప్పులేస్తుంటాడు అలెన్. తాను ఇలా రన్ వే పైన డాన్స్ చేయడం వల్ల ఫ్లైట్ సిబ్బందికి… విమానాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నాడతను. ఇందుకు పర్మిషన్ కూడా తీసుకున్నాడట. తన చేతల కారణంగా ఎవరూ గందరగోళంలో పడే పరిస్థితి కూడా ఉండదన్నాడు. ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్లు నెర్వస్ ఫీల్ కాకుండా.. ఉల్లాసంగా మార్చేందుకు తాను అలా చేస్తానని వివరించాడు. వైమానిక రంగంలో ఉద్యోగం చేయడం సంతోషంగా ఉందని.. ప్రయాణికులకు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం కోసం ఈ పనిచేస్తున్నా అన్నాడు.

 

Posted in Uncategorized

Latest Updates