ప్రకాశ్‌ రాజ్‌ రచయితగా ‘దోసిట చినుకులు’


ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ రచయితగా తనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. ‘దోసిట చినుకులు’ పేరిట రాసిన పుస్తకాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జాతీయ పుస్తక ప్రదర్శనలో తనతోటి నటులతో కలిసి ఆవిష్కరించారు. తన భావాలకు పుస్తక రూపం తీసుకురావాలన్న మిత్రుల సూచనతో ఈ పుస్తకం రాశానని చెప్పారు. రచయితగా చేసిన ఈ కొత్త ప్రయాణం తనకు సరికొత్త అనుభూతిని, సంతృప్తినిచ్చిందన్నారు ప్రకాశ్ రాజ్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్… ప్రకాశ్‌ రాజ్‌ గొప్ప నటుడు మాత్రమే కాదు.. గొప్ప రచయిత అని ప్రశంసించారు. ఆ తర్వాత మాట్లాడిన సినీనటుడు తనికెళ్లభరణి మంచినటుడు మంచి దర్శకుడు అవ్వడం అరుదన్నారు. ప్రకాశ్‌ రాజ్‌ రచించిన ‘దోసిట చినుకులు.. దోసిట తేనెవంటి పుస్తకమన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు కృష్ణవంశీ, ఓలేటి పార్వతీశం, బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates