ప్రగతి పథంలో సిద్దిపేట

sidipetకొత్త జిల్లాల ప్రక్రియ సిద్దిపేట నుంచే ప్రారంభించారు సీఎం కేసీఆర్… 2016 దసరా రోజు కొత్త జిల్లాగా అవతరించింది. అదే రోజు జిల్లాకు పోలీసు కమిషనరేట్ ను కూడా ప్రకటించారు సీఎం. మున్సిపల్ కార్పోరేషన్ స్థాయి లేకుండా ఏర్పాటయిన పోలీసు కమిషనరేట్ ఇదొక్కటే. అప్పటికి మెదక్ కలెక్టర్ గా ఉండి.. సిద్దిపేట మీద ప్రత్యేకంగా శ్రద్ద పెట్టిన వెంకటరాంరెడ్డినే తన సొంత జిల్లాకు పాలనాధికారిగా నియమించారు కేసీఆర్.

ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి పనులపై వెళ్లేందుకు ఇక్కడివారు అవస్థలు పడాల్సివచ్చేది. శాఖాధిపతుల ఆపీసుల్లో పని ఉంటే 140 కిలోమీటర్ల దూరం వెళ్లిరావడం అధికారులకు, ఉద్యోగులకు ఇబ్బందిగా ఉండేది. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో దూర భారం తగ్గింది. ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని.. ఏ పనైనా చకాచకా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల విభజనలో భాగంగా కరీంనగర్, వరంగల్ పాత జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాలు సిద్దిపేట జిల్లాలో కలిశాయి. ఆయా జిల్లాలకు దూరంగా ఉన్న మండలాలను తమకు సమీపంలోని సిద్దిపేటలో చేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాము సీఎం సొంత జిల్లాలో భాగం కావడంతో తమ ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని ఆశిస్తున్నారు. ఏ సమస్య అయినా ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో పరిష్కారమవుతుందంటున్నారు.

జిల్లా ఏర్పాటు తర్వాత అభివృద్ది పరుగులు పెడుతుందని అంటున్నారు స్థానికులు. సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం కావడంతో సాగునీటి పథకాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. గోదావరి జలాలను తరలించి.. ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు శరవేగంగా పనులు చేస్తున్నారు. మల్లన్నసాగర్ సహా ఆరు రిజర్వాయర్లను ఇక్కడ నిర్మిస్తున్నారు.  డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. సిద్దిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుంది. గజ్వేల్ లో ఎడ్యుకేషన్ హబ్ గా మారనుంది.

జిల్లా మీద, ఇక్కడి సమస్యమీద ముందునుంచే కలెక్టర్ వెంకటరాంరెడ్డికి మంచి  అవగాహన ఉంది. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండడమేకాక.. అన్ని శాఖలు సమర్థంగా పని చేసేలా చూస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతున్నామని అంటున్నారు కలెక్టర్ వెంకట్రాంరెడ్డి. జిల్లాల ఏర్పాటుతో అధికారుల మద్య పోటీతత్వం పెరిగిందని.. అందరూ బాగా పని చేస్తున్నారని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ గా అవతరించింది. మొదటి సీపీగా శివకుమార్ వచ్చారు. కమిషనరేట్ తో నేరాల సంఖ్య  తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే జిల్లాలో 12 గ్రామాలను క్రైం ఫ్రీ విలేజీలుగా మార్చారు. పోలీసుల పనితీరు మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయిస్తున్నారు సీపీ. దీంతో పోలీసులతీరు మారింది. ప్రజలకు, పోలీసుకుల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Posted in Uncategorized

Latest Updates