ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపు..పొన్నం ప్రభాకర్ అరెస్ట్

ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదనే కారణంగా ముట్టడికి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు… పొన్నం ను ప్రగతి భవన్ కు తీసుకెల్తామని పోలీస్ వెహికిల్ లో ఎక్కించుకున్నారు. తనను అరెస్ట్ చేసారని గ్రహించిన పొన్నం…రోడ్డు పైనే పోలిస్ వెహికిల్ నుంచి దూకే ప్రయత్నం చేసారు…కాసేపు పోలీసులకు పొన్నం మధ్య వాగ్వాదం జరిగింది. పొన్నంను హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates