ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థికి చుక్కెదురు

తార్నాక: జీహెచ్ఎంసీ ప్రచారానికి వెళ్లిన ఓ టీఆర్ఎస్ అభ్యర్థికి చుక్కెదురైంది. తార్నాక డివిజన్‌‌లోని మాణికేశ్వర్ నగర్‌‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మోతె శ్రీలతా శోభన్ రెడ్డిని బస్తీవాసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తల మధ్య శ్రీలత ప్రచారం నిర్వహించారు. రెండ్రోజుల కిందట సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కత్తి పద్మారావు గౌడ్‌‌ను ఇదే బస్తీవాసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తార్నాక సిట్టింగ్ కార్పొరేటర్ అలకుంట్ల సరస్వతికి టికెట్ ఎందుకు ఇవ్వలేదని బస్తీ వాసులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య ప్రచారాన్ని నిర్వహించారు.

Latest Updates