ప్రచారంలో బిజీ.. ప్రసంగాలతో గొంతు పోగొట్టుకున్న సిద్ధూ

పంజాబ్ : వరుస ఎన్నికల ప్రచారంతో పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గొంతు బొంగురుపోయింది. డాక్టర్ల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. విస్తృత షెడ్యూల్ కారణంగా ఆయన స్వరపేటిక దెబ్బతింది. ఆయన గొంతు బొంగురుపోవడంతో 3 నుంచి 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. 17 రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా గడిపిన సిద్దూ… 70కి పైగా బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు.

నిత్యం హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణించాల్సి రావడం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందనీ… కొన్నేళ్ల క్రితం అధిక విమాన ప్రయాణాల కారణంగానే ఆయన డీవీటికి (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం) గురయ్యారని  తెలిపారు సిద్ధూ స్పెషల్ ఆఫీసర్స్. ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి డాక్టర్లు పలుసార్లు రక్తపరీక్షలు నిర్వహించారన్నారు.

Posted in Uncategorized

Latest Updates