ప్రచారంలో లొల్లి.. హైదరాబాద్ లో కాంగ్రెస్ పాదయాత్రలు ప్రారంభం

హైదరాబాద్ : ఎన్నికల ప్రచార వేళ రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూపులు- కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. ఇంటింటి ప్రచారం, నేతల పాదయాత్రలు మొదలుపెట్టే ముందు… ఖైరతాబాద్ మహంకాళి పోచమ్మ గుడిలో ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు చేశారు. AICC కార్యదర్శులు బోస్ రాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్ తో పాటు… ప్రచార కమిటీ నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,  హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంల ో పాల్గొన్నారు.

అంజన్ కుమార్ యాదవ్ ఆద్వర్యంలో హైదరాబాద్ నగరంలో పాదయాత్ర మొదలుపెట్టారు. కేసీఆర్, టీఆర్ఎస్ వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పాదయాత్ర మొదలుపెట్టారు. ఖైరతాబాద్ సెగ్మెంట్ పరిధిలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేతలు ప్రచారం మొదలుపెట్టిన సందర్భంలోనే నాయకుల మధ్య గొడవ జరిగింది.

స్థానిక కాంగ్రెస్ నాయకుడు రాజు యాదవ్ ప్రచారంలో పార్టీ నేతలతో గొడవకు దిగారు. ప్రచార కార్యక్రమానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని… తనకు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని.. ప్రశ్నించారు. ఏఐసీసీ సెక్రటరీల ఎదుటే నిరసన తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సొంత పార్టీ నేతల నిరసనతో పార్టీ సీనియర్లు ఇబ్బందిపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates