ప్రచారానికి రండి.. బాలయ్యకు టీడీపీ నేతల రిక్వెస్ట్

హైదరాబాద్ : హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణను కలిశారు రాష్ట్ర టీడీపీ నాయకులు. సారథి  స్టూడియోలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న బాలయ్యతో టీడీపీ రాష్ట్ర పార్టీ నాయకుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇతర నేతలు కలిశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతల విజ్ఞప్తికి బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రచారానికి బాలకృష్ణ స్టార్ క్యాంపెయినర్ కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మరోవైపు.. ఇటీవల ఖమ్మం జిల్లాలో బాలయ్య పర్యటించారు. పలు పట్టణాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  అదే సందర్భంగా మాట్లాడిన బాలయ్య… టీడీపీ తోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఈసారి టీడీపీ నేతలు బాలకృష్ణను కోరారు.

Posted in Uncategorized

Latest Updates