ప్రజలకు ఒరిగిందేమీ లేదు … ఆ కుటుంబమే బంగారమైంది : రేణుకాచౌదరి

సత్తుపల్లి : నాలున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్దిలో వెనుకబడిందని, ధనిక రాష్ట్రం అప్పులపాల య్యిందన్నారు మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి. బుధవారం సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారం అయ్యింది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి కేసీఆర్‌ జైలుకు పంపిన సంఘటన ఖమ్మంలోనే జరిగిందన్న విషయాన్ని రైతులు ఇంకా మర్చిపోలేదన్నారు. కేసీఆర్‌ కూతురు కవితకు బతుకమ్మలు అప్పజెప్పి, పనికిమాలిన సిల్క్‌ చీరలు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చి కేసీఆర్‌ అవమానపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలుదారులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు రేణుక. ప్రశ్నించేవారిపై దాడులు చేయడం, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కేసీఆర్‌ పాలనకు పరాకాష్ట అన్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారని, ఈ దుర్మార్గాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు రేణుకాచౌదరి.

Posted in Uncategorized

Latest Updates