ప్రజలు పన్నులు కడితే..పెట్రోల్ పై కోతలుండవు: జైట్లీ

JAITLEYప్రజలు నిజాయతీగా పన్నులు చెల్లిస్తే ప్రభుత్వం ఆదాయం కోసం చమురుపై ఆధారపడే పరిస్థితి ఉండదన్నారు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ. దీంతోపాటు చమురుపై ఎటువంటి పన్ను కోతలు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. ఇటువంటి చర్యలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయన్నారు. కేవలం వేతన జీవులు మాత్రమే పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారని… మిగిలిన వర్గాలు కూడా పన్నులు చెల్లించాలని కోరారు.

పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించే ప్రసక్తే లేదని చెప్పారు. తమ ప్రభుత్వం బాధ్యతతో కూడిన ఆర్థిక విధానాలు అవలంబించడంతో గత ఆర్థిక సంవత్సరంలో చమురేతర పన్ను ఆదాయం 9.8 శాతం వరకు పెరిగిందని తెలిపారు. ఇంధన ధరలను లీటరుకు రూ.25 తగ్గించాలన్న చిదంబరం డిమాండ్‌కు అంగీకరిస్తే భారత్‌ అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం ఖాయమన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులనే తమతో చేయించాలని చిదంబరం చూస్తున్నారని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్‌ ఎక్సైజ్‌ డ్యూటీపై తగ్గించే ప్రతి రూపాయికీ ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం పడుతుందన్నారు జైట్లీ.

 

Posted in Uncategorized

Latest Updates