ప్రజలు మావైపు.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు : కాంగ్రెస్

గాంధీ భవన్ లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, మల్లు భట్టివిక్రమార్క, మల్లు రవి ఇతర నాయకులు వేర్వేరుగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఈవీఎంల పనితీరుపై మాట్లాడారు.

 

హరీష్, కేటీఆర్ తప్ప అందరినీ జనం తరిమికొట్టారు : శ్రవణ్

ప్రచారం అప్పటికి పోలింగ్ డే రోజుకి ఏమాత్రం పొంతన లేని రిజల్స్ట్ వచ్చాయన్నారు సంపత్ కుమార్.  కేసీఆర్,కేటీఆర్, కవిత, కలిసి ఈవీఎంలను ట్యాంపర్ చేశారన్న అనుమానం ఉందన్నారు. 2009లో ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని కేసీఆర్ చెప్పారన్న సంగతిని గుర్తుచేశారు సంపత్. అధికార పార్టీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్, సోషల్ మీడియా అకౌంట్లపై సీబీఐ ఎంక్వైరీ జరగాలన్నారు. ఎగ్ న్యాక్ కంపెనీకి ఓట్లు పంపి.. ట్యాప్ చేశారని ఆరోపించారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరుగా మారిందన్నారు. 22 లక్షల ఓట్ లు తీసేశారని.. నియంతృత్వ దేశాలలో ఉంటే ఉరి తీసేవారని అన్నారు. రజత్ కుమార్ కు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలన్నారు. హరీష్ రావు, కేటీఆర్ తప్ప మిగితా ఎమ్మెల్యేలను జనం తరిమికొట్టారని.. ఫలితాలు నమ్మేలా లేవన్నారు. ఈవీఎంలు 60రోజుల ముందే తెలంగాణకు వచ్చాయని.. ఎన్నికల్లో మొరాయించినా పట్టించుకోలేదని.. ట్యాంపరింగ్ జరిగిందని అన్నారు.

మాకొచ్చిన సీట్లు వాళ్లు వేసుకున్నారు : మల్లు రవి

ప్రజలు కాంగ్రెస్ వైపు.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయన్నారు అద్దంకి దయాకర్. 90 సీట్లు వస్తాయని ముందే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. భారతదేశంలోనే అతి ఖరీదైన ట్యాoపరింగ్ జరిగిందన్నారు. నియోజక వర్గానికి  రూ.25 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా తాము కూటమికి ఓట్ వేశామని చెప్పారు.. కానీ టీఆర్ఎస్ ఎలా గెలిచిందో అర్థం కావడం లేదన్నారు మల్లురవి.  వీవీ ప్యాట్ రిసీప్ట్ లను లెక్కించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. బ్యాలెట్ పేపర్ ల ద్వారా ఓట్ లు మళ్ళీ నిర్వహించాలన్నారు. మాకు వచ్చిన రిజల్ట్ ను టీఆర్ఎస్ వాళ్లు వేసుకున్నారని అన్నారు మల్లురవి.

Posted in Uncategorized

Latest Updates