ప్రజల కంటే ప్రధాని గొప్పవాడు కాదు : రాహుల్ గాంధీ

aniకర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. ప్రలోభాలకు లొంగకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. జేడీఎస్ అధనేత దేవెగౌడకు అభినందనలు తెలిపారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు దీని నుంచి పాఠం నేర్చుకోవాలన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్ధను బీజేపీ నాశనం చేసిందన్నారు. జాతీయ గీతం పాడకముందే సభ నుంచి బీజేపీ నేతలు వెళ్లిపోయారన్నారు. ప్రజాతీర్పుని బీజేపీ గౌరవించలేదన్నారు. ప్రధానమంత్రి ప్రజల కన్నా, సుప్రీంకోర్టు కన్నా పెద్దవాడు కాదన్నారు రాహుల్. కర్ణాటక ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రధాని నియంతలా వ్యవహరిస్తున్నారన్న విషయం ప్రజలకు, సుప్రీం కోర్టుకి తెలుసునన్నారు రాహుల్ గాంధీ. అపోజిషన్ పార్టీలన్నీ కలిసి బీజేపీని ఓడిస్తాయన్నారు రాహుల్.

Posted in Uncategorized

Latest Updates