ప్రజల పక్షాన మూర్తి సినిమాలు : వెంకయ్య

VENKAIAHఆర్ నారాయణ మూర్తి తీసే సినిమాలు ప్రజల పక్షాన ఉంటాయని, ప్రజా సమస్యలు పరిష్కారా మార్గాలను ఆయన సినిమాలు చూపిస్తాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రైతు సమస్యలపై అన్నదాత సుఖీభవ సినిమా తీసిన నారాయణ మూర్తిని అభినందించారు. ఈ సందర్భంగా మంగళవారం (మే-22) ఆర్ నారాయణ మూర్తికి సన్మారం చేసిన వెంకయ్య.. మూర్తి సినిమాలు చూస్తే ప్రతీ ఒక్కరికీ నేటి సమాజం ఎంటో అర్ధమవుతుందన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి చేసిన సన్మానానికి ధన్యవాదాలు తెలుపారు. తానెప్పుడూ ప్రజా సమస్యలు ప్రతిబించేలా సినిమానాలు తీసేందుకు ఇష్టపడతానని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి.

Posted in Uncategorized

Latest Updates