ప్రజల ప్రేమ, నమ్మకమే నాకు స్పూర్తి : మోడీ

MODI WISHకేంద్రంలోని  ఎన్డీయే  ప్రభుత్వానికి  నాలుగేళ్లు  పూర్తైన  సందర్భంగా  దేశ ప్రజలకు ధన్యవాదాలు  చెప్పారు  ప్రధాని నరేంద్రమోడీ.  దేశ ప్రజలకు  శిరస్సు  వంచి నమస్కరిస్తున్నానని  ట్వీట్ చేశారు.  అభివృద్ధే  ముఖ్యమైన  అంశంగా  నాలుగేళ్ల  పాలన కొనసాగిందన్నారు.  దేశాభివృద్ధిలో  పౌరులందరు  భాగస్వాములయ్యారని  చెప్పారు. 125 కోట్ల  మంది  ప్రజలే  దేశాన్ని ఉన్నత  స్థాయికి  తీసుకెళ్లారని  ట్వీట్ చేశారు. ప్రజల ప్రేమ,  నమ్మకమే  తమకు  స్పూర్తినిచ్చిందన్నారు  మోడీ.  రాబోయే  రోజుల్లో  కూడా  ఇదే అంకితభావంతో  పనిచేస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates