ప్రజల వద్దకే: మెట్రోస్టేషన్లో కూరగాయలు

metro-vegetablesప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందుబాటులో తీసుకు రావడంతో పాటు…వారి నిత్యావసరాలను కూడా తీర్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ముఖ్యంగా మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల సమయం వృధా కాకుండా మెట్రోలే ప్రాయణిస్తూనే… నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నారు అధికారులు.

అందులో భాగంగానే నిత్యావసరమైన కూరగాయలను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. తమ గమ్య స్థానం వచ్చాక ట్రైన్ దిగి వెల్లి పోయేవారు ఇంటికి వెళ్లే సమయంలో అవసరమైన తాజా కూరగాయలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిదశలో 11 ప్రధానమైన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను దశలవారీగా మెట్రోస్టేషన్లన్నింటికీ విస్తరించనున్నారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో ప్రారంభమైన నాగోల్ నుంచి మియాపూర్ 30 కిలోమీటర్ల రూట్లలో ఉన్న 24 స్టేషన్లలో కూరగాయలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తాజా కూరగాయలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే నగరమంతా మన కూరగాయలు పేరుతో కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మార్కెటింగ్‌శాఖ.. ఇదే విధానాన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్నది.

కూరగాయలసాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన మన కూరగాయలు పథకం మెట్రోప్రయాణికులకు వరంగా మారింది. ప్రస్తుతం ప్రారంభమైన మెట్రోస్టేషన్లతోపాటు త్వరలో ప్రారంభం కానున్న అమీర్‌పేట -హైటెక్‌సిటీ, అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ కారిడార్లకు కూడా విస్తరిస్తున్నారు. సౌకర్యాన్ని సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates