ప్రజాస్వామ్య పరిరక్షణకు బహిరంగ సభలు నిర్వహిస్తాం: ఉత్తమ్

jana-reddy
తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థలను TRS  ప్రభుత్వం ఖూనీ చేసిందని TPCC  అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కోర్టు తీర్పును కూడా స్పీకర్‌ అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 11న అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి కోర్టు తీర్పును అమలు చేయాలని కోరతామన్నారు. సభలో ఏం జరిగిందో కోర్టుకు తెలిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఖమ్మం, ఆలంపూర్‌లలో బహిరంగ సభలు నిర్వహించనున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో పార్టీ ప్రజా ప్రతినిధులు 24 గంటలపాటు నిరసన దీక్ష చేపడతారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

CLP సమావేశాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు CLP నేత జానారెడ్డి అన్నారు. అవసరాలనుబట్టి సమావేశాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చుని చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు జానా.

Posted in Uncategorized

Latest Updates