ప్రజా రక్షణ కోసమే పోలీసులు : వరంగల్ సీపీ

V-Ravinder-IPS-Commissioner-of-Police-Warangal-Cityప్రజలకు  రక్షణ  కల్పించేందుకు  పోలీసులు  సన్నద్ధంగా  ఉన్నారని చెప్పారు…  వరంగల్  పోలీస్ కమిషనర్  రవిందర్. గ్రామాల్లో దొంగల వస్తున్నారంటూ వస్తున్న రూమర్స్ పై గురువారం (మే-24) మీడియాతో మాట్లాడారు సీపీ, వాట్సప్, ఫేస్ బుక్  లాంటి  సామాజిక మాధ్యమాలలో  జరుగుతున్న  అసత్య ప్రచారాలు  నమ్మొద్దన్నారు.  పార్ధీ దొంగలు,  చిన్నపిల్లల  కిడ్నాపర్లు తిరుగుతున్నారనేది  తప్పుడు  ప్రచారమన్నారు.  ఎక్కడో  జరిగిన  సంఘటనలకు  సంబంధించిన  ఫొటోలు  మార్ఫింగ్ చేసి..  సామాజిక  మాధ్యమాల్లో  ప్రచారం  చేస్తున్నారని  చెప్పారు.

వదంతులు  సృష్టించేవారిపై  సైబర్ క్రెమ్  కింద కేసులు  నమోదు చేస్తున్నామన్నారు.  అనుమానాస్పద  వ్యక్తులు  కనిపిస్తే …పోలీస్ స్టేషన్ కు  సమాచారం  ఇవ్వాలని  సూచించారు కమిషనర్.

Posted in Uncategorized

Latest Updates