ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చా : పవన్ కళ్యాణ్

gogiప్రజలను వంచించటంలో బాబుది అపారమైన అనుభవమన్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్పెషల్ ప్యాకేజీకి సపోర్ట్ చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. జనం అండగా ఉంటే 2019లో సరికొత్త ప్రజా ప్రభుత్వం వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి జనసేన పోరాట యాత్ర ప్రారంభించారు పవన్ కల్యాణ్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్.. ప్రత్యేక హోదా కోసమే టీడీపీ వెంట నడిచానన్నారు. టీడీపీ హామీలు ఇవ్వటం తప్ప చేసింది లేదన్నారు. తాను డబ్బులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. సేవ కోసమే వచ్చానన్నారు పవన్.

Posted in Uncategorized

Latest Updates