ప్రజ్ఞానంద: చిన్న ఏజ్ లోనే జీఎం హోదా

Praggnandhaaప్రపంచ చెస్‌ చరిత్రలో చిన్న ఏజ్ లో గ్రాండ్‌మాస్టర్‌ (GM) హోదా పొందిన రెండో ప్లేయర్‌గా చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ఇటలీలో జరుగుతున్న గ్రెడైన్‌ ఓపెన్‌లో శనివారం(జూన్-23) జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో ప్రజ్ఞానంద భారత్ తరపున ఆడి 33 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్‌ లూకా మోరోనిపై గెలుపొందాడు.

ఈ ప్రదర్శనతో ప్రజ్ఞానందకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా లభించేందుకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ ఖాయమైంది. 12 ఏళ్ల 10 నెలల 14 రోజుల వయస్సులో ప్రజ్ఞానంద GMహోదా పొందాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున తక్కువ ఏజ్ లోనే జీఎం అయిన పరిమార్జన్‌ నేగి (ఢిల్లీ–13 ఏళ్ల 4 నెలల 22 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు ప్రపంచంలో చిన్న వయస్సులో జీఎం అయిన రికార్డు సెర్గీ కర్జాకిన్‌ (రష్యా–12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది

 

Posted in Uncategorized

Latest Updates