ప్రణబ్ సందేశం : భరతమాత కన్న బిడ్డ హెగ్డేవార్

pranab-rssరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నాగ్ పూర్ లోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ సందర్భంగా RSS వ్యవస్థాపకులు హెగ్డేవార్ మెమోరియల్ ను సందర్శించారు. ఆయన స్మారక కేంద్రంలో నివాళులు అర్పించారు. ప్రస్తుతం హెగ్డేవార్ మెమోరియల్ గా ఉన్న భవనంలోనే.. 1925లో ఆయన RSSను ప్రారంభించారు. ఈ విషయాలను.. ప్రణబ్ ముఖర్జీ వెంట ఉండి అన్నీ వివరించారు ప్రస్తుత RSS చీఫ్ మోహన్ భగవత్. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్ లో తన సందేశం రాశారు దాదా.

భరతమాత కన్న గొప్ప బిడ్డ RSS వ్యవస్థాపకులు హెగ్డేవార్ అంటూ ప్రశంసించారు. ఆయనకు స్వయంగా నివాళులు అర్పించేందుకు ఇక్కడకు వచ్చాను అని రాశారు. RSS తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో.. సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించటానికి నాగపూర్ వచ్చారు ప్రణబ్. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రపతి అయ్యి.. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ.. పార్టీ, సిద్ధాంతం పరంగా కాంగ్రెస్ విబేధించే RSS సమావేశానికి హాజరుకావటం ఆ పార్టీని నిరుత్సాహానికి గురి చేసింది.

Posted in Uncategorized

Latest Updates