ప్రతిష్ఠాత్మక ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకొన్న ఇండో అమెరికన్

హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండో అమెరికన్ మహిళ మీనల్ పటేల్ డేవిస్ అమెరికాలో అత్యున్నత ప్రెసిడెన్షియల్ అవార్డు గెలుచుకున్నారు. వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సమక్షంలో విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్టేందుకు హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ కు ప్రత్యేక సలహాదారుగా మీనల్ పని చేస్తోంది.
అవార్డు అందుకొన్న సందర్భంగా మీనల్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు. మా ఇంట్లో అమెరికాలో పుట్టినవారిలో నేనే మొదటి దాన్ని. హ్యూస్టన్ మేయర్ ఆఫీసులో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా. ఈ అవార్డు అందుకోవడం నమ్మలేకపోతున్నాను అని మీనల్ అన్నారు. అమెరికాలో నాలుగో పెద్ద నగరమైన హ్యూస్టన్ లో మీనల్ పని చేస్తోంది. ఈ రంగంలో హ్యూస్టన్ సిటీ చేపట్టిన చర్యలపై స్ధానిక, జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో మీనల్ ప్రజంటేషన్ ఇచ్చారు. యూఎన్ వరల్డ్ హ్యుమానిటేరియన్స్ సమ్మిట్ లో కూడా ప్రసంగించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నివారుణకు తీసేకొనే చర్యలపై ఈ మధ్య ఇండియా, కెనడాలో పర్యటించి అధికారులతో చర్చించారు.

Posted in Uncategorized

Latest Updates