ప్రతి గ్రామంలో టీబీ గురించి అవగాహన కల్పించాలి: గవర్నర్ నరసింహన్

ప్రతి గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి టీబీ గురించి అవగాహన కల్పించాలన్నారు గవర్నర్ నరసింహన్. టీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీబీ సీల్ సేల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ టీబీ ఉన్నవారికి వైద్య పరీక్షలు చేయాలని టీబీ అసోసియేషన్ ని కోరారు. టీబీ అసోసియేషన్ వారు టీబీ ని నిర్ములించరేందుకు కృషి చేస్తునందుకు అభినందనలు తెలిపారు. టీబీ చాలా భయాంకరమైందని, ఒకరినుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉందన్నారు గవర్నర్. 2025 నాటికి దేశంలో టీబీ లేకుండా చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు నరసింహన్. మంచి ఆహారం అందిస్తే రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి గ్రామంలో కనీసం ఒక్కసారైనా టీబీ పరీక్షలు చేయాలన్నారు గవర్నర్ నరసింహన్.

Posted in Uncategorized

Latest Updates