ప్రతి తలకాయకీ ఉండాల్సిందే : బైక్ వెనక కూర్చున్నా హెల్మెట్ మస్ట్

helmet-wearబైక్ తీస్తే హెల్మెట్ మస్ట్.. ప్రస్తుతం ఇది అమలు అవుతుంది కదా.. కొత్తగా ఏంటీ అనుకోవద్దు.. ఇప్పుడు కొత్త రూల్ ఒకటి వచ్చింది. బైక్ వెనక కూర్చున్న వారు కూడా విధిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అవును.. ఇది చెబుతున్నది ఎవరో కాదు మద్రాస్ హైకోర్ట్. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ ఆదేశాలు జారీ చేసింది. బండి ఎక్కే ప్రతి తలకాయకీ హెల్మెట్ ఉండాల్సింది. ఒక్కోసారి ముగ్గురు కూడా వెళతారు.. అప్పుడు ఆ ముగ్గురు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. లేకపోతే ట్రిపుల్ డ్రైవింగ్ కింద ఓ ఫైన్.. హెల్మెట్ పెట్టుకోనందుకు మరో ఫైన్ ఇలా రెండు పడతాయి. ఈ జరిమానా ఎంతో తెలుసా.. అక్షరాల రూ.10వేలు. అవును.. మీరు ఆటోలోనో.. క్యాబ్ లోనూ వెళ్లినా ఇంత ఛార్జి పడదు. కక్కుర్తి పడి బైక్ వెనక కూర్చుని.. హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం ఇంత భారీ జరిమానా చెల్లించాల్సిందే అంటోంది తమిళనాడు పోలీస్ శాఖ. దేశ వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్న ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

మద్రాసు హైకోర్టు ఆదేశాలు.. తమిళనాడు పోలీస్ శాఖ అమల్లోకి యమ స్పీడ్ గా తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఇదే విధానం మిగతా రాష్ట్రాలు కూడా అతి త్వరలో ఫాలో అయ్యే అవకాశాలు లేకపోలేదు కదా.. బీ కేర్ ఫుల్.. మీ బండిపై మరొకరు ప్రయాణిస్తున్నారు అంటే మరో హెల్మెట్ ఇప్పుడే కొనిపెట్టుకోండి.. ఒకటి తలకాయకి పెట్టుకోండి.. మరొకటి బండికి లాక్ చేసి పెట్టుకోండి.. ఎప్పుడైనా ఆపదలో.. అవసరానికో.. మర్యాద కోసమో.. అయ్యే పాపం అని కనికరించి లిఫ్ట్ ఇచ్చినప్పుడు వారికి ఆ హెట్మెట్ పనికొస్తుంది.. ఆల్ ద బెస్ట్ రైడర్స్…

Posted in Uncategorized

Latest Updates