ప్రతి నీటి చుక్క చెరువులకు మళ్లించాలి: సీఎం కేసీఆర్


గొలుసుకట్టు చెరువులను ఉపయోగించుకొని రాష్ట్రంలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా చెరువులకు మళ్లించాలన్నారు. తెలంగాణలోని అన్ని చెరువులు ఏడాది పొడవునా నిండుకుండల్లా కళకళలాడాలని చెప్పారు. భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువలతో…గొలుసుకట్టు చెరువుల అనుసంధానం.. అనే అంశంపై ప్రగతి భవన్ లో CM కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ, ఇస్రోతో చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్ పై…నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ప్రాజెక్టుల ద్వారా తీసుకున్న నీరు ఒక్క చుక్క కూడా వృధా కాకుండా చెరువులకు మళ్లించాలని అధికారులకు సూచించారు. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటిపారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates