ప్రతి పక్షాలకు అభివృద్ధి కనిపించడంలేదు : జోగు రామన్న

ప్రతిపక్ష నేతలు కళ్లు మూసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి జోగురామన్న. దేశంలో ఎక్కడా లేని అభివృద్ది మన దగ్గర జరుగుతున్నా… వారికి కనిపించడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు…ఇవ్వని హామీలను కూడా అమలు చేశామన్నారు మంత్రి. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యమైనా…అందరికీ ఇళ్లు అందేలా చూస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి…బీసీ గురుకుల హాస్టల్ లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించి..విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్లాంకెట్లను అందించారు.

Posted in Uncategorized

Latest Updates