ప్రతి మెట్రో స్టేషన్ ఓ టూరిస్ట్ స్పాట్ ఔతుంది… గవర్నర్

హైదరాబాద్ : అమీర్ పేట్ – ఎల్బీనగర్ మెట్రోరైలును గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ ఉదయం ప్రారంభించారు. ఆ తర్వాత అమీర్ పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. అక్కడ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో గవర్నర్ నరసింహన్ , మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

“హైదరాబాద్ ప్రజలంతా మెట్రోను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాదు.. నగరంలో కాలుష్యం కూడా తగ్గిపోతుంది. మెట్రో స్టేషన్లలో ఫుడ్ కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో స్టేషన్ల నిర్మాణం చాలా అందంగా ఉంది. నేను చాలాసార్లు మెట్రోలో ప్రయాణించాను. ప్రయాణికులనుంచి ఎటువంటి కంప్లయింట్లు లేవు. ఫ్యూచర్ లో అవి పర్యాటక ప్రాంతాలుగా మారనున్నాయి. హెచ్ఎంఆర్, జీహెచ్ఎంసీ కలిసి దీనికి కృషి చేయాలి ” అని అన్నారు గవర్నర్.

“మెట్రో స్టేషన్లలో సకల సౌకర్యాలు అందిస్తాం. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ… ప్రయాణికులకు భద్రత కల్పిస్తూ మెట్రో స్టైషన్ ను డిజైన్ చేశాం. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇదే” అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates