ప్రతీ ఏడాది రూ. 25 వేల కోట్లు ఖర్చు: కేటీఆర్

ktr11దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం( ఫిబ్రవరి-16) కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తుర్కయంజాల్‌లోని జేబీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఆరుసార్లు వచ్చామన్నారు. వచ్చినప్పుడల్లా కిషన్‌రెడ్డి ఏదో ఒక అభివృద్ధి పని చేయించుకుంటున్నరని తెలిపారు. అభివృద్ధి ఎప్పుడూ జరిగే ప్రక్రియ అని… సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. సమ దృష్టితో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.

సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రతీ ఏడాది రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఇబ్రహీంపట్నంలో 85 వేల ఎకరాలకు నీరిందిస్తామన్నారు. నీళ్లివ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన నేత కేసీఆర్ అని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తమని స్పష్టంచేశారు. హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని తెలిపారు. అంతేకాదు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి కేటీఆర్ .

Posted in Uncategorized

Latest Updates