ప్రతీ పల్లెకు కరెంట్ అందిస్తాం: ప్రధాని మోడీ

మారుమూల పల్లెలలకు కూడా కరెంట్ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సౌభాగ్య స్కీమ్ పై దేశ ప్రజలతో లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యారు ప్రధాని. స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా ఎన్నో ప్రాంతాలకు కరెంట్ సరఫరా లేదన్నారు. గత ప్రభుత్వం చేసిందేమీ లేదని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 2009 వరకు ప్రతి గ్రామానికి విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరో అడుగు ముందుకేసి ప్రతి ఇంటికి విద్యుత్‌ తీసుకొస్తామని హామీ ఇచ్చారని. అయితే ఇందులో ఏ ఒక్క హామీని వారు నెరవేర్చలేకపోయారన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మోడీ. అయితే తమ ప్రభుత్వం అలా కాదని.. 2018, ఏప్రిల్‌ 28 వరకే అన్ని గ్రామాలను విద్యుత్‌ సదుపాయం కల్పించామని తెలిపారు మోడీ. 31, 2019 వరకు ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని…సముద్ర మార్గంలో లైన్లు వేసి తాము విద్యుత్ అందిస్తున్నామని.. పర్యాటకంగా ఇండియాను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates