ప్రతీ విద్యార్థికి స్కూళ్లలో హెల్త్ చెకప్ లు

school-children-health-check-up2018-19 విద్యా సంవత్సరానికి తెలంగాణ పాఠశాల అకడమిక్ కేలండర్ ను విద్యాశాఖ ప్రకటించింది. దీనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆమోదం తెలిపారు. ఇందులో మొదటి సారిగా విద్యార్థుల ఆరోగ్య పరీక్షల గురించి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థులందరికీ అకాడమిక్ ఇయర్ లో తప్పని సరిగా రెండు సార్లు హెల్త్ చెకప్  లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైతే స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయించాలంది. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేకంగా హెల్త్‌ కార్డులను జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates